Bigg Boss 5: సిరి సంబంధాలు చూస్తున్నాం.. ప్రియాంక పిచ్చి గీతలు అర్థం చేసుకున్న మానస్‌

బిగ్‌బాస్‌ హౌస్‌లో సండే సందడి షురూ అయ్యింది. ఎలిమినేషన్‌ విషయాన్ని మర్చిపోయి మరీ.. ఇంటిసభ్యులందరూ సరదా ఆటల్లో భాగమయ్యారు....

Updated : 21 Nov 2021 17:06 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ హౌస్‌లో సండే సందడి షురూ అయ్యింది. ఎలిమినేషన్‌ విషయాన్ని మర్చిపోయి మరీ.. ఇంటిసభ్యులందరూ సరదా ఆటల్లో భాగమయ్యారు. ఇంటిసభ్యుల్లో కొందరు తమ తోటి కంటెస్టెంట్‌ల నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే వారు రాసిన ప్రశ్నలను స్టేజ్‌పై ఉన్న నాగ్‌ చదివి.. సమాధాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా మానస్‌ని.. ‘‘భవిష్యత్తులో ప్రియాంకతో నీ రిలేషన్‌షిప్‌ ఎలా ఉండనుంది’’ అని మిగిలిన ఇంటిసభ్యులు తెలుసుకోవాలనుకుంటున్నారు అని నాగ్‌ అడగ్గా.. ‘‘స్నేహితులుగానే ఉంటాం’’ అని సమాధానమిచ్చాడు. అనంతరం ప్రియాంకని.. ‘‘నువ్వు మానస్‌ నుంచి ఏం కోరుకుంటున్నావ్‌’’ అని అడగ్గా.. ‘‘సర్‌.. నన్ను ఈ ప్రశ్న అడగమని ఎవరు చెప్పారో చెప్పండి’’ అని ఆమె కోరగా.. ‘‘మానస్‌’’ అంటూ నాగ్‌ నవ్వులు పూయించాడు. ఇక ఈసారి బిగ్‌బాస్‌ హౌస్‌లో యువ కథానాయకుడు రాజ్‌తరుణ్‌ నటించిన ‘అనుభవించు రాజా’ టీమ్‌ వచ్చి సందడి చేసింది. ఈ సందర్భంగా హౌస్‌మేట్స్‌తో రాజ్‌తరుణ్‌ మాట్లాడారు. ఇలా ఎంతో సరదాగా సాగుతోన్న బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ఎవరు ఎలిమినేట్‌ కానున్నారో తెలియాలంటే ఈ రోజు ప్రసారం కానున్న ఎపిసోడ్‌ చూడాల్సిందే.

Read latest Cinema News and Telugu News



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని