Bimbisara: ‘బింబిసార’ టీజర్‌ వచ్చేసింది..!

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బింబిసార’. చారిత్రక నేపథ్యం ఉన్న కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి వశిష్ట్‌ దర్శకత్వం...

Published : 29 Nov 2021 10:12 IST

హైదరాబాద్‌: నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బింబిసార’. చారిత్రక నేపథ్యం ఉన్న కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి వశిష్ట్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకొంటున్న ఈ సినిమా టీజర్‌ను సోమవారం ఉదయం చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో కల్యాణ్‌ రామ్‌ బింబిసార అనే క్రూరమైన రాజుగా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా కేథరిన్‌, సంయుక్త మేనన్‌ సందడి చేయనున్నారు. కల్యాణ్‌రామ్‌ రోల్‌ తెలియజేసేలా ఈ టీజర్‌ రూపుదిద్దుకొంది.

‘‘ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే.. కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసులైతే.. ఇందరి భయాన్ని చూస్తూ పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది’’ అనే సంభాషణలతో సాగిన ఈ టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. మునుపెన్నడూ లేనివిధంగా పొడవాటి జుత్తుతో సీరియస్‌ లుక్‌లో కల్యాణ్‌ రామ్‌ కనిపించారు. ఇక, టీజర్‌ చివర్లో ఆయన స్టైలిష్‌ లుక్‌లోనూ సందడి చేశారు. యన్‌.టి.ఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌ రామే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని