Happy Birthday Pawan Kalyan: సమాజ శ్రేయస్సు కోసం పరితపించే నిప్పుకణం నా తమ్ముడు:  చిరంజీవి

తన తమ్ముడు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ పది మందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పుకణమని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. పవన్‌ 50వ పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన ట్విటర్‌.....

Published : 02 Sep 2021 11:57 IST

పవన్‌కల్యాణ్‌ @ 50.. వెల్లువెత్తిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌: తన తమ్ముడు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ పది మందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పుకణమని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. పవన్‌ 50వ పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌తో దిగిన ఫొటోలు షేర్‌ చేసిన చిరు.. తమ్ముడి లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. చిరుతోపాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

‘చిన్నప్పటి నుంచి సమాజం గురించే కల్యాణ్‌ ప్రతి ఆలోచన.. ప్రతి అడుగు.. పది మందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం.. కల్యాణ్‌. అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ - చిరంజీవి

‘పవన్‌కల్యాణ్‌ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో, ఎల్లప్పుడూ ప్రజలకు సేవలందించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’ -తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై

‘సినీ కథానాయకులు, ప్రజా నాయకులు పవన్‌కల్యాణ్‌ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను’ - చంద్రబాబు నాయుడు

‘ప్రతి చోట.. ప్రతి విషయంలో స్టార్‌.. బంగారం లాంటి మనస్సున్న వ్యక్తి పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ నుంచి మరెన్నో సినిమాలు రావాలి.. మా అందర్నీ ఇంకెంతగానో అలరించాలి అని కోరుకుంటున్నాను’ - రాఘవేంద్రరావు

‘హ్యాపీ బర్త్‌డే మై పవన్‌కల్యాణ్‌. ఈ రోజుతోపాటు రానున్న ఏడాదంతా మీకు సంతోషం, ఆనందం కలగాలని కోరుకుంటున్నాను’ - అల్లు అర్జున్‌

‘నా ఆప్తమిత్రుడు, గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో నువ్వు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను’ - రవితేజ

‘నిజం, నిజాయతీ, సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనం. పరిశ్రమలో నాకెంతో ఇష్టమైనవారిలో ఒకరైన పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’ - వక్కంతం వంశీ

‘హ్యాపీ బర్త్‌డే కల్యాణ్‌ బాబాయ్‌..!! నీ మాటలతో రేపు అనేది ఎంతో ఆనందంగా, అందంగా ఉంటుందనే నమ్మకం మాలో కలుగుతుంది. నువ్వు ఎప్పటికీ ఓ స్ఫూర్తిప్రదాత. ఎల్లప్పటికీ నీ వెంటే ఉంటాను’ - నిహారిక కొణిదెల

‘హ్యాపీ బర్త్‌డే బాబాయ్‌!! అన్నింటిలో నీకు మంచే జరగాలని.. విజయం వరించాలని కోరుకుంటున్నాను’ - వరుణ్‌ తేజ్‌

‘మన పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. దేనికి తలొగ్గకూడదు అనేదాన్ని మీ నుంచి నేర్చుకున్నాను. మీరు మాలో నింపిన స్ఫూర్తికి ధన్యవాదాలు’ - బాబీ

‘ఒక నటుడిగా, నాయకుడిగా ఎన్నో మిలియన్ల మందిలో స్ఫూర్తి, ప్రేరణ నింపిన మోస్ట్‌ పవర్‌ఫుల్‌ మ్యాన్‌, ప్రియమైన సోదరుడు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’ - మెహర్‌ రమేశ్‌

‘నా గురువు, ధైర్యమైన పవన్‌కల్యాణ్‌ మామకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆయురారోగ్యాలతో జీవించాలి’ - సాయిధరమ్‌ తేజ్‌

‘ఈ ప్రత్యేకమైన రోజున పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు ఆయురారోగ్యాలు సొంతం కావాలని ప్రార్థిస్తున్నాను. ఆ నవ్వు.. ఆ ధైర్యం.. ఆ పవర్‌.. ఎంతో మందిలో స్ఫూర్తినింపింది!! మా సపోర్ట్, ప్రేమాభిమానం మీ వెంటే ఉంటుంది’ - సంపత్‌ నందిRead latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని