
Salman Khan: ‘ఇలాంటి పనులు చేయకండి’.. అభిమానులకు సల్మాన్‌ఖాన్ విజ్ఞప్తి
ఇంటర్నెట్ డెస్క్: ఓ థియేటర్‌లో తన అభిమానులు చేసిన హంగామాని చూసి బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్ విచారం వ్యక్తం చేశారు. మరోసారి అలా చేయొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. సల్మాన్‌ఖాన్, ఆయన బావమరిది ఆయుష్ శర్మ కలిసి నటించిన చిత్రం ‘అంతిమ్: ది ఫైనల్ ట్రూత్’. ఇటీవల విడుదలైన ఈ సినిమాని థియేటర్‌లో చూస్తూ సల్మాన్ అభిమానులు కొందరు క్రాకర్స్‌ను కాల్చారు. మరికొందరు థియేటర్ బయట ఉన్న సల్మాన్ పోస్టర్‌కి పాలాభిషేకం చేశారు. సంబంధిత వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది సల్మాన్‌ఖాన్ దృష్టికి వెళ్లగా ఆయన స్పందించారు. ‘అభిమానులారా.. క్రాకర్స్‌లాంటి వాటిని థియేటర్లలోకి తీసుకెళ్లకండి. వాటి వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలుంటాయి. మీ జీవితంతోపాటు ఇతరుల జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టకండి. సినిమాని ఇంకా చాలా విధాలుగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి పనులు మాత్రం చేయకండి. నీరు కూడా దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది మీరు పాలను వృథా చేశారు. ఇదే పాలను చిన్నారులకు ఇస్తే మంచి పనిచేసినవారవుతారు’ అని పేర్కొన్నారు. పేలుడు పదార్థాలను లోపలికి అనుమతించకుండా సెక్యూరిటీని పటిష్ఠం చేయాలని థియేటర్ యాజమాన్యాలను అభ్యర్థించారు.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.