Published : 10/11/2021 01:26 IST

Kangana Ranaut: నేనందుకున్న అవార్డే వారి నోరు మూయిస్తుంది: కంగనా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నాపై విమర్శలు గుప్పించే వారందరికీ నేను అందుకున్న అవార్డే సమాధానం చెప్తుంది. అదే వారి నోరు మూయిస్తుంది’ అని బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్‌ అన్నారు. పద్మశ్రీ అవార్డును అందుకున్న అనంతరం కంగనా ఈ వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ విమర్శకులకు చురకలు అంటించారు. 

‘నటిగా ఇప్పటి వరకూ ఎన్నో అవార్డులు అందుకున్నాను. కానీ, పద్మశ్రీ అవార్డు స్వీకరించినపుడు కలిగిన ఆనందం ఎప్పుడూ లేదు. చిన్న వయసులోనే నేను సినిమా రంగంలో అడుగుపెట్టాను. మంచి నటిగా గుర్తింపు పొందేందుకు 8 నుంచి 10 ఏళ్ల సమయం పట్టింది. చివరకి విజయం సాధించా. అయితే అప్పుడు సక్సెస్‌ను ఆస్వాదించలేకపోయా. ఇతర సమస్యల్లో ఇరుక్కున్నాను. ఫెయిర్‌నెస్‌ ప్రొడక్టులు వాడకపోవడం, ఐటెం సాంగ్స్‌కి నృత్యం చేయకపోవడం, మేల్‌ లీడ్స్‌ (కథానాయక ప్రాధాన్య సినిమా) చిత్రాల్లో ఎక్కువగా నటించకపోవడం సమస్యల్ని తెచ్చిపెట్టాయి. సినిమా రంగంలో డబ్బు కంటే ఎక్కువగా శత్రువులనే సంపాదించుకున్నా. సామాజిక, రాజకీయ అంశాలపై స్పందించినప్పుడు నాపై అనేక కేసులు వేశారు. అది నా పని కాదని విమర్శించేవారు. అలాంటి వారందరికీ ఈ అవార్డే సమాధానం చెప్తుంది’ అని అన్నారు. సినిమా రంగానికి సంబంధించి పద్మశ్రీ పురస్కారం స్వీకరించిన వారిలో కంగనాతోపాటు గాయకుడు అద్నాన్‌ సమీ, నిర్మాతలు కరణ్‌ జోహార్‌, ఏక్తా కపూర్ ఉన్నారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని