Shilpa Shetty: మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టిన శిల్పాశెట్టి

బాలీవుడ్‌ ప్రముఖ నటి శిల్పాశెట్టి సుమారు నెల రోజుల తర్వాత  సెట్స్‌లోకి అడుగుపెట్టింది. అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసులో తన భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్‌ కావడం, మరోవైపు ఫిట్‌నెస్‌ సెంటర్‌ విషయంలో ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడినందుకు శిల్పా, ఆమె తల్లి సునంద శెట్టిపై కేసు నమోదవడంతో శిల్పా వ్యక్తిగతంగా సతమతమైంది.

Updated : 19 Aug 2021 18:36 IST

ముంబయి: బాలీవుడ్‌ ప్రముఖ నటి శిల్పాశెట్టి మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టింది. అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసులో తన భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్‌ కావడం, మరోవైపు ఫిట్‌నెస్‌ సెంటర్‌ విషయంలో ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడినందుకు తనపై, ఆమె తల్లి సునంద శెట్టిపై కేసు నమోదవడంతో శిల్పా వ్యక్తిగతంగా సతమతమైంది. దాంతో ‘సూపర్‌ డ్యాన్సర్‌’ రియాలిటీ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోన్న ఆమె కొంతకాలం నుంచి దూరంగా ఉంటున్నారు. సుమారు నెల రోజుల తర్వాత మళ్లీ ఆ షోలో సందడి చేయనున్నారామె. న్యాయనిర్ణేతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించేందుకు మళ్లీ ఆ కార్యక్రమ సెట్స్‌లో అడుగుపెట్టారు. దానికి సంబంధించిన వీడియోను కొందరు అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఉంచగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. శిల్పతోపాటు కొరియోగ్రాఫర్‌ గీతాకపూర్‌, దర్శకుడు అనురాగ్‌ బసు ఉన్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని