Allu Arjun: అల్లు అర్జున్‌పై బీటౌన్‌ దర్శకుల హర్షం.. ఎందుకంటే..?

‘వరుడు కావలెను’ ప్రీరిలీజ్ వేడుకలో ఐకాన్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్‌ దర్శకులు హర్షం వ్యక్తం చేశారు. బన్నీ.. నిజమైన సూపర్‌స్టార్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. బుధవారం సాయంత్రం నిర్వహించిన....

Published : 28 Oct 2021 16:56 IST

హైదరాబాద్: ‘వరుడు కావలెను’ ప్రీరిలీజ్ వేడుకలో ఐకాన్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్‌ దర్శకులు హర్షం వ్యక్తం చేశారు. బన్నీ.. నిజమైన సూపర్‌స్టార్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. బుధవారం సాయంత్రం నిర్వహించిన ‘వరుడు కావలెను’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్‌.. ‘‘కరోనా కారణంగా సినీ పరిశ్రమ ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. అన్నిరకాల జాగ్రత్తలు పాటిస్తూ అందరూ థియేటర్‌లోనే సినిమా చూడాలి. బాలీవుడ్‌ ఇండస్ట్రీ కూడా పూర్వవైభవాన్ని సొంతం చేసుకోవాలి. త్వరలో విడుదల కానున్న ‘సూర్యవంశీ’ మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను’’ అని బన్నీ తెలిపారు.

కాగా, బన్నీ వ్యాఖ్యలపై స్పందించిన ‘సూర్యవంశీ’ డైరెక్టర్‌ రోహిత్‌ శెట్టి..‘‘సినిమా అనేది నా ఒక్కడిదే కాదు. మనందరిదీ’ ఈ మాటనే నేను ఎక్కువగా నమ్ముతాను. ఈ చిత్రానికి విషెస్‌ తెలిపినందుకు థాంక్యూ అల్లుఅర్జున్‌! నువ్వు నటిస్తున్న ‘పుష్ప’ మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను’’ అని రోహిత్‌ రిప్లై ఇచ్చారు. ‘థ్యాంక్యూ బన్నీ.. నువ్వు నిజంగానే సూపర్‌స్టార్‌’ అని కరణ్‌ జోహార్‌ ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని