
Salman Khan: చిరంజీవి చిత్రంలో సల్మాన్‌ఖాన్.. బ్రిట్నీ స్పియర్స్ అదిరిపోయే పాట
ఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్ ప్రముఖ నటుడు చిరంజీవి చిత్రంలో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నటించే అవకాశాలున్నాయంటూ ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. వీటిపై సంగీత దర్శకుడు తమన్ స్పష్టతనిచ్చారు. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో ఆయన మాట్లాడుతూ చిరంజీవి, సల్మాన్‌ఖాన్ కలిసి నటిస్తున్నారని వెల్లడించారు. చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కిస్తున్న చిత్రం ‘గాడ్ ఫాదర్’. సూపర్‌హిట్ మలయాళ చిత్రం ‘లూసీఫర్’ రీమేక్‌గా రూపొందుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులోనే సల్మాన్‌ఖాన్ కనిపించనున్నారు. అంతేకాదు ఈ ఇద్దరూ కలిసి ఓ హుషారైన గీతానికి డ్యాన్స్ చేయబోతున్నారని, ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్‌తో ఈ పాటని పాడించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తమన్ తెలిపారు. ఆమెతో తెలుగు పాట పాడించాలా? ఇంగ్లిష్ సాంగ్ పాడించాలా? అనే విషయంలో ఇంకా స్పష్టతరాలేదన్నారు.
ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోంది. ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణలో ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘ఆచార్య’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకురానుంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరు ప్రకటించిన ‘భోళా శంకర్’ చిత్రం గురువారం పట్టాలెక్కింది. వీటితోపాటు దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ)తో చిరు ఓ చిత్రం చేస్తున్నారు.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
-
India News
Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
-
Viral-videos News
Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
-
India News
Sidhu Moose Wala: సిద్ధూ మూసేవాల కేసులో షార్ప్‌షూటర్ అరెస్టు
-
Sports News
IND vs ENG: శ్రేయస్‌ను తెలివిగా బుట్టలో వేసిన ఇంగ్లాండ్.. వీడియో చూడండి
-
Movies News
Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
- IND vs ENG: నాలుగో రోజు ముగిసిన ఆట.. భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సిందే!
- Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
- Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
- Tamil Nadu: తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి.. సంచలన వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ
- News In Pics: చిత్రం చెప్పే సంగతులు