
Updated : 02 Dec 2021 15:39 IST
Unstoppable: ‘ఆయన కమెడియన్ కాదు.. సింహం’.. బాలకృష్ణతో బ్రహ్మానందం హాస్యం
ఇంటర్నెట్ డెస్క్: ‘బాలకృష్ణగారు కామెడీ చేస్తారు. అయినా ఆయన కమెడియన్ కాదు సింహం’ అని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్స్టాపబుల్’ కార్యక్రమానికి విచ్చేసి సరదగా సంభాషించారు. మరో అతిథిగా దర్శకుడు అనిల్ రావిపూడి విచ్చేశారు. ఈ ఇద్దరితో బాలకృష్ణ ఓ ఆట ఆడుకున్నారు. మాంచి వినోదం పంచారు. ఓ ఫొటోను చూపించి, దీన్ని దేనికి వాడతామని బాలకృష్ణ అడగ్గా.. అనిల్ రావిపూడి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ‘ఏయ్.. ఏది పడితే అది చెప్పకు’ అంటూ బ్రహ్మానందం నవ్వులు పూయించారు. తనకెంతో పేరు తీసుకొచ్చిన పాత్రను ఈ కార్యక్రమ వేదికపై అభినయించి అలరించారు.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
Tags :