Cinema News: కొత్త మార్గానికి శ్రీకారం

హాస్య నటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్‌ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. సుబ్బు చెరుకూరి దర్శకుడు. సృజన్‌ యరబోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో పూజా

Updated : 20 Nov 2021 06:59 IST

హాస్య నటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్‌ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. సుబ్బు చెరుకూరి దర్శకుడు. సృజన్‌ యరబోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాతో సర్వైవల్‌ థ్రిల్లర్‌ అనే కొత్త కాన్సెప్ట్‌ను తెరకు పరిచయం చేయనున్నాం. మోనోఫోబియాతో బాధపడుతున్న ఓ యువ రచయిత కథగా ఉంటుంది. అతని జీవితానికి ప్రమాదం ఏర్పడినప్పుడు.. దాన్ని అధిగమించి ఎలా బయటపడ్డాడనే కథాంశంతో రూపొందింది. ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతి అందిస్తుంద’’న్నారు. సంగీతం: శ్రీరామ్‌ మద్దూరి, ఛాయాగ్రహణం: మోహన్‌.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని