Rowdy Boys: ‘రౌడీ బాయ్స్‌’ బృందావనం సాంగ్‌.. అనుపమ డ్యాన్స్‌ అదుర్స్‌!

ఆశిష్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం ‘రౌడీ బాయ్స్‌’. సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.

Updated : 07 Dec 2022 21:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆశిష్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం ‘రౌడీ బాయ్స్‌’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ‘బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే’ అనే గీతాన్ని చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ఈ వీడియోలో.. అనుపమ పరమేశ్వరన్‌ డ్యాన్స్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఆమె హావభావాలు కుర్రకారుని కట్టిపడేసేలా ఉన్నాయి. సుద్దాల అశోక్‌తేజ రచించిన ఈ పాటను మంగ్లీ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రానికి శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మాతలు. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కార్తిక్‌ రత్నం, తేజ కూరపాటి, కోమలి ప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదల తేదీ త్వరలోనే ఖరారుకానుంది. 

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని