Bro: సమాజానికి గుర్తుండిపోయే ‘బ్రో’

నవీన్‌ చంద్ర, అవికా గోర్‌ అన్నాచెల్లెళ్లుగా  నటించిన చిత్రం ‘బ్రో’. కార్తిక్‌ తుపురాని దర్శకుడు. జేజేఆర్‌.రవిచందర్‌ నిర్మించారు. సాయి రోనక్‌, దేవిప్రసాద్‌, ప్రమోదిని తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated : 08 Dec 2021 07:18 IST

వీన్‌ చంద్ర, అవికా గోర్‌ అన్నాచెల్లెళ్లుగా నటించిన చిత్రం ‘బ్రో’. కార్తిక్‌ తుపురాని దర్శకుడు. జేజేఆర్‌.రవిచందర్‌ నిర్మించారు. సాయి రోనక్‌, దేవిప్రసాద్‌, ప్రమోదిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవలే ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్‌లో   విడుదలైంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి చదలవాడ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘‘సమాజానికి గుర్తుండిపోయే మంచి సినిమా తీశారు. అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చక్కగా చూపించారు’’ అన్నారు. ‘‘మరాఠీలో వచ్చిన ‘హ్యాపీ బ్రదర్‌’   సినిమాకి రీమేక్‌ ఇది. మాతృకలోని కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చుకొని తెరకెక్కించాను. నవీన్‌ చంద్ర, అవికా గోర్‌ నటన కథకు మరింత బలాన్ని అందించింది. శేఖర్‌ చంద్ర సంగీతం మరింత ఆకర్షణ తీసుకొచ్చింద’’న్నారు దర్శకుడు. నటుడు నవీన్‌ చంద్ర మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు సినిమాని బాగా తీశాడు. ఇకపైనా ఇలాంటి మంచి కథలతోనే వస్తాను’’ అన్నారు. ‘‘ఈ పాత్రను ఓ సవాల్‌లా స్వీకరించి చేశాను. ఇప్పటి వరకు నేను చేసిన చిత్రాల్లో ఇదే అత్యుత్తమవుతుంది’’ అంది నాయిక అవికా. నిర్మాత మాట్లాడుతూ.. ‘‘చాలా రోజుల తర్వాత మంచి చిత్రం తీశాను. చెల్లెల్ని అమితంగా ప్రేమించే అన్న పాత్ర ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది’’ అన్నారు. టి.ప్రసన్నకుమార్‌, భాస్కర భట్ల, సాయిరోనక్‌, దేవిప్రసాద్‌, శ్రీనివాస్‌, ప్రమోదిని పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని