Bigg Boss telugu 5: పింకీని గెలిపించుకోవాలంటే డైరెక్ట్‌గా చెప్పేయొచ్చు కదా!

బిగ్‌బాస్‌(Bigg boss telugu 5) హౌస్‌లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌ మొదలైంది. నామినేషన్స్‌తో హీటెక్కిన

Updated : 23 Nov 2021 19:00 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌(Bigg boss telugu 5) హౌస్‌లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌ మొదలైంది. నామినేషన్స్‌తో హీటెక్కిన హౌస్‌మేట్స్‌ తాజాగా ఇంటి కెప్టెన్‌ అయ్యేందుకు మరోసారి బరిలోకి దిగారు. ఇందులో భాగంగా బిగ్‌బాస్‌ ‘నియంత మాటే శాసనం’ అనే టాస్క్‌ ఇచ్చాడు. గార్డెన్‌ ఏరియాలో ఒక నియంత సింహాసనం ఉంటుంది. దానిలో ఎవరైతే ముందు కూర్చొంటారో వాళ్లు ఆ రౌండ్‌లో సేఫ్‌ అవ్వడంతో పాటు, నియంతగా వ్యవహరిస్తారు. మిగిలిన ఇంటి సభ్యులు వారిని వారు సేవ్‌ చేసుకునేందుకు ఒక ఛాలెంజ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతి ఛాలెంజ్‌లో చివరి స్థానంలో నిలిచిన ఇద్దరు ఇంటి సభ్యుల్లో ఒకరిని సేవ్‌ చేయాల్సిందిగా నియంత కుర్చీలో కూర్చొన్న వారిని ఒప్పించాల్సి ఉంటుంది. అలా సేవ్‌ అయిన వారు కెప్టెన్‌ పోటీదారులు అవుతారంటూ బిగ్‌బాస్‌ ఈ టాస్క్‌ను డిజైన్‌ చేశాడు.

ఈ సందర్భంగా హౌస్‌మేట్స్‌ వివిధ టాస్క్‌ల్లో పాల్గొన్నారు. నియంత సింహాసనం ఎక్కిన సిరి ‘ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. అమ్మాయిలు వాట్‌ టు డు.. వాట్‌ నాట్‌ టు డు’ అని డైలాగ్‌ చెప్పడం నవ్వులు పూయించింది. ‘నేను కెప్టెన్‌ కావాలనుకుంటున్నా’ అని కాజల్‌(Kajal) అడగ్గా, ‘నువ్వు రెండు ఫొటోలు కాల్చేశావు కదా! నువ్వు కెప్టెన్‌ అయితే ఏం చేసేదానివి’ అని శ్రీరామ్‌(sri ram) ప్రశ్నించాడు. ‘కెప్టెన్‌ కాజల్‌ ఫైరింజన్‌లో కూర్చోదు’ అని సమాధానం ఇచ్చింది. ఆ సమాధానంతో ఏకీభవించని శ్రీరామ్‌.. రవి(Ravi)ని కాపాడాడు. ‘అర్హత ఉన్న వ్యక్తి మాత్రమే కెప్టెన్‌ బ్యాండ్‌ వేసుకోవాలి’ అంటూ శ్రీరామ్‌ కరాకండీగా చెప్పాడు. ఇక నియంత కుర్చీలో ప్రియాంక, సిరి ఒకేసారి కూర్చోవడంతో సిరి-మానస్‌ల మధ్య చర్చ జరిగింది. ‘అన్నీ అబద్ధాలు. పింకీని గెలిపించుకోవాలంటే డైరెక్ట్‌గా చెప్పేయొచ్చు కదా’ అని సిరి ఏడుపు అందుకుంది. ‘ఏడిస్తే చెత్తలా ఉంటుంది’ అని షణ్ముఖ్‌ అసహనం వ్యక్తం చేశాడు. మరి ఈ టాస్క్‌లో ఎవరు విజయం సాధించారు? ఎవరు కెప్టెన్‌ పోటీదారులు అయ్యారు? చివరకు ఇంటి కొత్త కెప్టెన్‌గా నిలిచింది ఎవరు?



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని