Sadha: మీరు పెళ్లి చేసుకుంటే మేం చాలా ఆనందంగా ఉంటాం..!

కథానాయికలు రాశి, మహేశ్వరి, శ్రద్ధాదాస్‌, సదా.. ఒక్కచోట చేరితే ఎలా ఉంటుందో ‘క్యాష్‌’ కార్యక్రమం చూపించనుంది. సుమ వ్యాఖ్యాతగా ప్రతి శనివారం రాత్రి 9:30 ని.లకు ఈటీవీలో ప్రసారమయ్యే

Published : 02 Sep 2021 01:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కథానాయికలు రాశి, మహేశ్వరి, శ్రద్ధాదాస్‌, సదా.. ఒక్కచోట చేరితే ఎలా ఉంటుందో ‘క్యాష్‌’ కార్యక్రమం చూపించనుంది. సుమ వ్యాఖ్యాతగా ప్రతి శనివారం రాత్రి 9:30 ని.లకు ఈటీవీలో ప్రసారమయ్యే ఎంటర్‌టైన్‌మెంట్‌ షో ఇది. ఈ వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలై, విశేషంగా అలరిస్తోంది. కార్యక్రమానికి విచ్చేసిన రాశి, మహేశ్వరి, శ్రద్ధాదాస్‌, సదా తమదైన శైలిలో నవ్వులు పూయించారు. వారితో కలిసి సుమ చేసిన అల్లరి ఆకట్టుకుంటుంది.

ఈ కార్యక్రమంలో సుమ కొన్ని చిలిపి ప్రశ్నలు అడిగే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘సదాగారు మీ కెరియర్‌లో ఇప్పటి వరకు మీకు ఎదురైన ప్రశ్నల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందేంటి?’ అని ప్రశ్నించగా ‘మీరు పెళ్లి చేసుకుంటే మేం చాలా హ్యాపీగా ఉంటాం’ అని అందరు అడుగుతుంటారు అని సదా సరదాగా చెప్తుంది. తర్వాత ‘సుమ టీ స్టాల్‌’, ‘హోమ్‌ టూర్‌’ వంటి స్కిట్లతో నలుగురు నాయికలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దాని గురించి చెప్పడం కంటే చూస్తేనే బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని