Samantha: ఉపాసన చెల్లి పెళ్లిలో సమంత సందడి

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కామినేని సోదరి అనుష్పాల వివాహం ఘనంగా జరిగింది. సుమారు ఐదురోజుల నుంచి జరుగుతోన్న ఈ పెళ్లి వేడుకలక...

Published : 10 Dec 2021 19:43 IST

హైదరాబాద్‌: మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన సోదరి అనుష్పాల కామినేని వివాహం ఘనంగా జరిగింది. సుమారు ఐదురోజులపాటు జరిగిన ఈ పెళ్లి వేడుకలకు కామినేని కుటుంబానికి చెందిన దోమకొండ కోట వేదికైంది. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. బుధవారం పెళ్లి జరగ్గా .. గురువారం రాత్రి విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమంత, శ్రియ, శిల్పారెడ్డితోపాటు సానియా మీర్జా తదితరులు సందడి చేశారు. ఉపాసన-రామ్‌చరణ్‌లతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను సమంత ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ.. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన స్నేహితులతో సాయంత్రం సరదాగా గడిచిందని ఆమె పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని