
RRR Trailer: రాజమౌళి సర్.. మతిపోతోంది..!
‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్‌పై ప్రముఖుల స్పందన
హైదరాబాద్: రామ్‌చరణ్ - తారక్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆర్ఆర్ఆర్’ (RRR). సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ (RRR Trailer)ని చిత్రబృందం విడుదల చేసింది. తారక్ - చరణ్‌ల పవర్‌ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌లతో నిండిపోయిన ఈ ట్రైలర్‌పై సినీ ప్రముఖులు స్పందించారు. ట్రైలర్ అత్యద్భుతంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.
🎬 రాజమౌళి సర్.. ట్రైలర్ చూస్తుంటే మతిపోతోంది. రామ్‌చరణ్, తారక్, అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్‌తోపాటు మొత్తం చిత్రబృందానికి నా అభినందనలు
- కరణ్ జోహార్
🎬 అద్భుతమైన ఎలివేషన్స్, పవర్ఫుల్ పాత్రలు, మనసుని హత్తుకునే భావోద్వేగాలతో ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ మేజిక్‌ని వెండితెరపై చూసేందుకు ఆతృతగా ఉన్నా
- క్రిష్
🎬 ట్రైలర్ చూస్తే గర్వంగా ఉంది. వేరే లెవల్ ట్రైలర్ ఇది
- విజయ్ దేవరకొండ
🎬 ఎమోషన్, యాక్షన్ల పర్ఫెక్ట్ కాంబినేషన్. ఎన్టీఆర్-రామ్‌చరణ్‌ల స్క్రీన్ ప్రజెన్స్ అదరగొట్టేలా ఉంది. మా అంచనాలకు మించి ఈ సినిమా ట్రైలర్ ఉంది. మన దేశంలో పుట్టిన ఉత్తమమైన దర్శకుడు రాజమౌళి
- కోన వెంకట్
🎬 ఈ అద్భుతమైన విజువల్స్ చూశాక మాటలు రావడం లేదు..! అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురంభీమ్‌గా తారక్‌ని చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్. ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో ప్రతిఒక్కరూ ఎంతలా శ్రమించారో ప్రతి ఫ్రేమ్‌లో తెలుస్తోంది. రాజమౌళికి అభినందనలు
- వెంకీ కుడుముల
🎬 అత్యద్భుతం.. మా ఊహలకు మించి ఈ ట్రైలర్‌ని రూపొందించారు. మన తారక్, చరణ్ అదరగొట్టేశారు. రాజమౌళి సర్.. మైండ్ బ్లోయింగ్ విజన్
- అనిల్ రావిపూడి
🎬 టేక్ ఏ బౌ రాజమౌళి.. ట్రైలర్ అదిరిపోయింది
- గోపీచంద్ మలినేని
🎬 రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్. ట్రైలర్ ఆద్యంతం సర్ప్రైజ్లతో నిండిపోయింది. భావోద్వేగాలు, ఎలివేషన్స్‌పై తనకున్న పట్టుని రాజమౌళి మరోసారి నిరూపించారు
- బాబీ
🎬 బిగ్గెస్ట్ గ్లోబల్ యాక్షన్ డ్రామా అనే టైటిల్ ఈ ట్రైలర్‌కి సరిగ్గా సెట్ అవుతుంది. అద్భుతమైన ప్రపంచం, పాత్రలు.. చూస్తుంటే మాటలు రావడం లేదు. చిత్రబృందానికి నా అభినందనలు
- మారుతి
🎬 ఇదొక అద్భుతం. రాజమౌళిగారు తన మరోసారి తన సత్తా చాటారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ లుక్స్ అదిరిపోయాయి. మనమంతా గర్వించదగ్గ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. - నారా రోహిత్.
🎬 ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ వేరే లెవల్లో ఉంది. ఆయుధాల్లాంటి ఇద్దరు హీరోలతో రాజమౌళి సృష్టించిన అద్భుతాన్ని వెండి తెరపై చూసేందుకు వేచి చూస్తున్నా. - నందమూరి కల్యాణ్‌రామ్.
🎬 కెప్టెన్ రాజమౌళి మీ పవర్‌ని చూపించారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. - రానా దగ్గుబాటి.
🎬 ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ మతిపోగొట్టింది. - వరుణ్‌తేజ్
🎬 మాటలు రావట్లేదు. నా అభిప్రాయాన్ని ఎలా తెలియజేయాలో అర్థంకావట్లేదు. ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. - పూజాహెగ్డే.
🎬 ఎమోషన్స్‌లోనూ, యాక్షన్ సన్నివేశాల్లోనూ అద్భుతమైన పెర్ఫామెన్స్ కనిపించింది. రాజమౌళి సర్ మీరు ఇండియన్ సినిమాకి గర్వకారణం. -రాశీఖన్నా.
🎬 సింహాలే కాదు.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కూడా గర్జిస్తుంది. - సాయిమాధవ్ బుర్రా.
🎬 ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది. - రష్మిక.
🎬 స్టార్లు కనపడటంలేదు. పాత్రలే కనపడుతున్నాయి. చిత్రీకరణ అద్భుతం. - గోపీమోహన్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.