Modi: మోదీ.. మీరు మరెన్నో విజయాలు అందుకోవాలి..!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరెన్నో విజయాలు అందుకోవాలని ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ ఆశించారు. శుక్రవారం ప్రధాని పుట్టినరోజు పురస్కరించుకుని....

Published : 17 Sep 2021 13:30 IST

ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సెలబ్రిటీలు

హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సినీ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మరెన్నో విజయాలు అందుకోవాలని ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ ఆకాంక్షించారు. ప్రధానితో దిగిన ఫొటోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసిన ఆయన.. ‘గౌరనీయులైన ప్రధాని నరేంద్రమోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలు, సంతోషం, విజయాలతో మీ ప్రయాణం కొనసాగాలని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు. మోహన్‌లాల్‌తోపాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మోదీకి విషెస్‌ చెబుతూ సోషల్‌మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని