Published : 14/11/2021 01:30 IST

God Father: చిరంజీవి సినిమాలో సల్మాన్‌ఖాన్‌ నటిస్తున్నారా?

హైదరాబాద్‌: చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘గాడ్‌ ఫాదర్‌’. మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్‌’ రీమేక్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో ప్రతి పాత్రకూ ఎంతో ప్రాధాన్యం ఉంది. కాగా, ఇప్పుడు ఇందులో సల్మాన్‌ఖాన్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. మలయాళంలో పృథ్వీరాజ్‌ సుకుమార్‌ పోషించిన పాత్రను సల్మాన్‌ చేస్తారని టాలీవుడ్‌ టాక్‌. అందులో పృథ్వీరాజ్‌ది అతిథి పాత్ర. మోహన్‌లాల్‌కు అండగా ఉంటూ అన్ని పనులు చక్క బెడుతుంటారు. కనిపించేది కొద్దిసేపే అయినా, ఉన్నంత సేపూ స్క్రీన్‌ దడదడలాడిపోతుంది. ఒక పాట కూడా ఉంటుంది. తెలుగులో ఈ పాత్ర సల్మాన్‌ పోషిస్తే బాగుంటుందని చిత్ర బృందం భావించింది. ఇదే విషయాన్ని ఆయనకు చెబితే, అందుకు సల్మాన్‌ కూడా సుముఖత వ్యక్తం చేశారట. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. అయితే, కేవలం పాటలోనే కనిపిస్తారా? లేక పృథ్వీరాజ్‌ పోషించిన పాత్రేనా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. గతంలో ‘సైరా’ కోసం అమితాబ్‌ నటించగా, ఇప్పుడు ‘గాడ్‌ ఫాదర్‌’ కోసం సల్మాన్‌ నటిస్తుండంతో అంచనాలు మరింత పెరిగాయి.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని