Tollywood: ముందుంది ‘మెగా పండగ’.. ఆకట్టుకుంటోన్న ‘స్టూవర్ట్‌పురం దొంగ’!
దీపావళి సందర్భంగా పలువురు దర్శకనిర్మాతలు తమ కొత్త చిత్రాల వివరాల్ని పంచుకున్నారు. పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయా సినిమాలపై ఆసక్తిని పెంచుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో చిత్రాల ఫస్ట్‌లుక్స్, పాటల ప్రోమో సందడి చేశాయి.
ఇంటర్నెట్ డెస్క్: దీపావళి సందర్భంగా పలువురు దర్శకనిర్మాతలు తమ కొత్త చిత్రాల వివరాల్ని పంచుకున్నారు. పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయా సినిమాలపై ఆసక్తిని పెంచుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో చిత్రాల ఫస్ట్‌లుక్స్, పాటల ప్రోమో సందడి చేశాయి. తాజాగా చిరంజీవి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నాగశౌర్య చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ వెలువడ్డాయి. అవేంటో చూసేయండి..
పూనకాలు లోడింగ్..
చిరంజీవి హీరోగా దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) గతంలో ఓ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభమవుతుందో తాజాగా తెలియజేశారు. ‘మెగా 154’ వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని నవంబరు 6న ఉదయం 11: 43 ని.లకు లాంఛనంగా ప్రారంభించనున్నట్టు తెలిపారు. ‘ముందుంది మెగా పండగ’ అని వ్యాఖ్యానించారు. అదే రోజున మధ్యాహ్నం 12:06 ని.లకు చిరంజీవి లుక్‌ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నాయిక, టైటిల్ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ‘పూనకాలు లోడింగ్’ అంటూ చిత్ర బృందం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
విభిన్న లుక్‌లో సాయి శ్రీనివాస్..
1970ల్లో పోలీసు అధికారులకు ముచ్చెమటలు పట్టించిన స్టూవర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘స్టూవర్ట్‌పురం దొంగ’. బయోపిక్ ఆఫ్ టైగర్ అనేది ఉపశీర్షిక. టైటిల్ పాత్ర పోషిస్తోన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫస్ట్‌లుక్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. రెండు చేతులతో ఆయుధాలు పట్టుకుని సీరియస్‌గా కనిపించారు సాయి శ్రీనివాస్. నాటి పరిస్థితులకు అద్దం పట్టేలా తీర్చిదిద్దిన ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. హీరోగా ఆయనకు ఇది 10వ చిత్రం. కె. ఎస్. దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ఓ లక్ష్యం.. గీతం
నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘లక్ష్య’. కేతిక శర్మ కథానాయిక. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా నుంచి ‘ఓ లక్ష్యం’ అంటూ సాగే పాటకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. శౌర్య, జగపతిబాబు మధ్య ఉన్న అనుబంధాన్ని ఇందులో చూపించారు. పూర్తి పాట నవంబరు 6న విడుదలకానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Nayanthara: నేనూ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా.. నయనతార షాకింగ్ కామెంట్స్
-
General News
TS News: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సీబీఐకి బదిలీ చేయాలా? వద్దా?: 6న హైకోర్టు తీర్పు
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Spy Balloon: అమెరికాలో చైనా బెలూన్ కలకలం.. అసలేంటీ ‘స్పై బెలూన్’..?
-
Movies News
Social Look: వెడ్డింగ్ డాక్యుమెంటరీ బిజీలో హన్సిక.. క్యాప్షన్ ఆలోచించలేక రకుల్!
-
General News
TSPSC Group 4: గ్రూప్-4కు 9.5లక్షల దరఖాస్తులు.. ప్రిపరేషన్లో ఈ టిప్స్ పాటిస్తే విజేత మీరే!