Chiranjeevi: చిత్ర పరిశ్రమకు చిరంజీవి పుట్టినరోజు కానుక ఇదే!

కరోనా సంక్షోభంలో సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు, టీకాలు వేయించి ఆదుకున్న మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ..

Updated : 22 Aug 2021 20:30 IST

హైదరాబాద్‌: కరోనా సంక్షోభంలో సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు, టీకాలు వేయించి ఆదుకున్న మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన పుట్టిన రోజును పురస్కరించుకొని 24 విభాగాల్లోని సినీ కార్మికుల ఆరోగ్యం దృష్ట్యా చిత్రపురి కాలనీలో 10 పడకల ఆసుపత్రిని నిర్మించనున్నట్టు ప్రకటించారు. అపోలో ఆసుపత్రి సహకారంతో అన్ని రకాల వైద్య చికిత్సలు అందేలా ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరలోనే చేపడతానని చిరంజీవి హామీ ఇచ్చినట్టు సినీనటుడు శ్రీకాంత్‌ తెలిపారు. చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని చిత్రపురి కాలనీ హౌసింగ్‌ సొసైటీలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాంత్‌.. రక్తదానం చేసి సినీ కార్మికులను అభినందించారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆసుపత్రి నిర్మాణానికి ఇచ్చిన హామీని కార్మికులతో పంచుకున్నారు. సినీ కార్మికుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్న మెగాస్టార్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని