Published : 06 Jan 2022 01:52 IST

Chiranjeevi: రాజేంద్రప్రసాద్‌కి చిరంజీవి ప్రశంస

హైదరాబాద్‌: సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ (Rajendra Prasad) ప్రధాన పాత్రలో నటించిన ‘సేనాపతి’ (Senapathi) పై మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ప్రశంసల వర్షం కురిపించారు. సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌ నటన అద్భుతంగా ఉందని ఆయన అన్నారు. ఈ మేరకు తాజాగా చిరు ట్వీట్‌ చేశారు.

‘‘సేనాపతి చిత్రాన్ని చూశా. యువదర్శకుడు పవన్‌ సాధినేని ఎంతో ఆసక్తికరంగా, అనుక్షణం ఏ జరుగుతుందోననే ఉత్కంఠతో ఉండేలా చిత్రాన్ని తెరకెక్కించాడు. మంచి అభిరుచికి అద్దంపట్టే చిత్రాన్ని నిర్మించిన యువ నిర్మాతలు సుస్మితా కొణిదెల, విష్ణులకి నా అభినందనలు. అన్నింటికీ మించి సీనియర్‌ నటుడు ‘నటకిరీటి’ రాజేంద్రప్రసాద్‌ ఒక వినూత్న పాత్రలో అద్భుతంగా నటించాడు. తన నటనా ప్రతిభకి ఈ చిత్రం మచ్చు తునక. ఈ ప్రయత్నం వెనుక వున్న గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ టీమ్‌ మొత్తానికి నా శుభాకాంక్షలు. ‘ఆహా’ ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుతుందని భావిస్తున్నా’’ అని చిరు తెలిపారు.

Read latest Cinema News and Telugu News

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts