Updated : 26 Nov 2021 07:59 IST

Chiranjeevi: టికెట్‌ ధరలపై పునరాలోచన చేయండి

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్‌ ధరల అంశంపై ఆ ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. ప్రభుత్వాల ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమ నిలదొక్కుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ టికెటింగ్‌తోపాటు సినిమా ప్రదర్శనలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శాసనసభలో ఇటీవల బిల్‌ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ టికెట్‌ ధరలపై కొన్ని సూచనలు చేశారు. ‘‘పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్‌ టికెటింగ్‌ బిల్‌ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం. అదే విధంగా థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాలు బతుకు తెరువు కోసం తగ్గించిన టికెట్‌ ధరల్ని కాలానుగుణంగా, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది. దేశమంతా ఒకటే జీఎస్టీగా ప్రభుత్వాలు పన్నులు తీసుకుంటున్నప్పుడు టికెట్‌ ధరల్లో అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయమై పునరాలోచించండి’’ అంటూ ట్వీట్‌ చేశారు చిరంజీవి.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని