Chiranjeevi: ‘చిరు 153’.. మొదలైంది
ప్రముఖ నటుడు చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా ఓ చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం ‘లూసీఫర్’ రీమేక్‌గా ‘చిరు 153’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటుడు చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా ఓ చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం ‘లూసీఫర్’ రీమేక్‌గా ‘చిరు 153’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. శుక్రవారం ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. సామాజిక మాధ్యమాల వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు దర్శకుడు. ‘నా తల్లిదండ్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల ఆశీస్సులతో మరో ప్రయాణం మొదలైంది’ అని తెలిపారు. ఛాయాగ్రాహకుడు, ఆర్ట్ డైరెక్టర్, స్టంట్ కొరియోగ్రాఫర్‌తో కలిసి దిగిన ఫొటోని పంచుకున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే యాక్షన్ సన్నివేశంతో చిత్రీకరణ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: నిరవ్‌షా, కళ: సురేశ్ సెల్వరాజన్, స్టంట్స్: సిల్వ. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య’ తుదిదశకు చేరుకుంది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తోంది. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీటితోపాటు మెహర్ రమేశ్, కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలోనూ నటించనున్నారు చిరంజీవి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
కంటి చుక్కలతో అమెరికాలో మరణం.. భారత ఔషధ సంస్థలో అర్ధరాత్రి తనిఖీలు
-
Movies News
butta bomma review: రివ్యూ: బుట్టబొమ్మ
-
Politics News
Raghunandanrao: వారికి రూ.5 లక్షలు కాదు.. రూ.7.50 లక్షలు ఇవ్వండి: ఎమ్మెల్యే రఘునందన్‌రావు
-
India News
Bomb blast: సన్నీ లియోనీ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs PAK: 2015 ప్రపంచకప్ సందర్భంగా విరాట్ కోహ్లీ అలా అన్నాడు: సోహైల్