Chiyaan60: ‘మహాన్‌’గా విచ్చేసిన విక్రమ్‌

విక్రమ్‌ కథానాయకుడిగా కార్తీక్‌ సుబ్బరాజు ఓ చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.

Published : 20 Aug 2021 20:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విక్రమ్‌ కథానాయకుడిగా కార్తీక్‌ సుబ్బరాజు ఓ చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్టుకి ‘మహాన్‌’ అనే పేరు ఖరారు చేశారు. లుక్‌ విషయానికొస్తే.. పొడవాటి జుత్తు, గడ్డంతో ఎర్రటి కళ్లద్దాలు పెట్టుకుని స్టైలిష్‌గా కనిపించారు విక్రమ్‌. హుందాగా బుల్లెట్‌పై కూర్చుని నవ్వుతూ దర్శనమిచ్చారు. ట్రెండీగా ఉన్న ఆయనకు కొమ్ములు ఉండటం ఆసక్తి పెంచుతోంది. మరి అలా ఎందుకు? అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే సగభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల్ని అలరించనుంది. ఈ సినిమాలో విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ నటిస్తుండటంతో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. విక్రమ్‌ సరసన సిమ్రన్‌ సందడి చేయనున్నారు. ఎస్‌.ఎస్‌. లలిత్‌ కుమరా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంతోశ్‌ నారాయణ్‌ సంగీతం అందిస్తున్నారు. విక్రమ్‌ నటిస్తోన్న 60వ చిత్రమిది. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని