AlluArjun: మెగా హీరోలకు అల్లు అర్జున్‌ స్పెషల్‌ పార్టీ

క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని అల్లు అర్జున్‌ (Allu Arjun) మెగా హీరోలకు స్పెషల్‌ పార్టీ ఇచ్చారు.  శనివారం రాత్రి బన్నీ నివాసంలో జరిగిన ఈ వేడుకలకు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ-ఉపాసన దంపతులు, నిహారిక-చైతన్య దంపతులు, వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌...

Published : 26 Dec 2021 12:02 IST

హైదరాబాద్‌: క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని అల్లు అర్జున్‌ (Allu Arjun) మెగా హీరోలకు స్పెషల్‌ పార్టీ ఇచ్చారు.  శనివారం రాత్రి బన్నీ నివాసంలో జరిగిన ఈ వేడుకలకు రామ్‌చరణ-ఉపాసన దంపతులు, నిహారిక-చైతన్య దంపతులు, వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌తోపాటు చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుస్మితా హాజరయ్యారు. వేడుకల అనంతరం ఫ్యామిలీ మొత్తం సరదాగా ఫొటోలకు పోజులిచ్చారు.  బన్నీ సతీమణి స్నేహా ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు.. ‘పిక్చర్‌ పర్‌ఫెక్ట్‌’ అని కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు అల్లు అర్జున్‌ ప్రస్తుతం ‘పుష్ప’ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇక, రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్స్‌లో ఫుల్‌ బిజీగా పాల్గొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని