Cinema News: అది పెద్ద విషయం కాదు.. నేషనల్‌ లెవెల్లో ఒక్క గోల్డ్‌!

‘క్లాప్‌’ సినిమా టీజర్‌ని ప్రముఖ కథానాయకుడు చిరంజీవి విడుదల చేశారు. ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్‌ నటిస్తున్న చిత్రమిది.

Updated : 17 Aug 2022 10:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదిపినిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘క్లాప్‌’. పృథ్వీ ఆదిత్య దర్శకుడు. ఆకాంక్ష సింగ్‌ కథానాయిక. తమిళ, తెలుగు భాషల్లో విడుదలకానున్న ఈ చిత్ర తెలుగు టీజర్‌ని ప్రముఖ నటుడు చిరంజీవి విడుదల చేశారు. ‘నా పేరు విష్ణు.. నాకు తెలిసిందంతా..’ అంటూ హీరో పాత్రని పరిచయం చేసే సన్నివేశంతో ప్రారంభమైన ఈ టీజర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఆది ఇందులో అథ్లెట్‌గా కనిపించారు. ‘కొంచెం టాలెంట్‌, రెండు కాళ్లు ఉంటే ఇక్కడ గెలిచేస్తారని అనుకుంటున్నావా’ అని బ్రహ్మాజీ, ‘స్టేట్‌ లెవెల్లో గెలిచేస్తావ్‌. అది పెద్ద విషయం కాదు. నేషనల్‌ లెవెల్లో ఒక్క గోల్డ్‌’ అంటూ ప్రకాశ్‌ రాజ్‌ చెప్పిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. నాయకానాయికల నటన మెప్పిస్తోంది. మరి విష్ణు అనుకున్న లక్ష్యం చేరుకున్నాడా? దాని కోసం ఎంతగా శ్రమించాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. బిగ్‌ ప్రింట్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని