Kiara Advani: అసభ్యత ఫొటోలో లేదు.. ఆలోచనలో ఉంది

కియారా అడ్వాణీ ఫొటోషూట్‌పై స్పందించిన ఫొటోగ్రాఫర్‌ డబూ రత్నానీ..

Updated : 02 Sep 2021 06:57 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఈ ఏడాది నెట్టింట బాగా వైరల్‌ అయిన ఫొటోల్లో బాలీవుడ్‌ నటి కియారా అడ్వాణీ ఫొటో ఒకటి. ఇసుక తిన్నెలపై పడుకుని ఓర చూపులతో చూస్తున్న కియారాకి ఎంతోమంది ఆకర్షితులయ్యారు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. టాప్‌లెస్‌గా ఈ ఫొటోషూట్‌లో పాల్గొందని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు సామాజిక మాధ్యమాల వేదికగా రాసుకొచ్చారు. ఆ విషయం ఈ ఫొటోషూట్‌ చేసిన ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ డబూ రత్నానీ వద్దకూ వెళ్లింది. దీనిపై ఇటీవల ఆయన స్పందించారు. ‘ఈ ఫొటోషూట్‌పై చేస్తున్న కామెంట్లను చదివా. మీరు ఊహించిన దాంట్లో నిజం లేదు. బ్లాక్‌ అండ్‌ వైట్ లుక్‌లో వైవిధ్యంగా ఉండాలని ఇలా చిత్రీకరించా. అంతే కానీ ఆమెను టాప్‌లెస్‌గా చూపించలేదు. అసభ్యత ఫొటోలో లేదు, అలా చూసేవారిలో ఉంది. దీని గురించి మాట్లాడకపోవడమే మంచిది’ అని తెలిపారు. ‘డబూ రత్నానీ క్యాలెండర్‌’ పేరుతో ఆయన ఏటా సెలబ్రిటీ ఫొటోలతో స్పెషల్‌ క్యాలెండర్‌ను విడుదల చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే 2021 జూన్‌లో కియారాతో చేసిన షూట్‌ని విడుదల చేశారు. కియారాతో 2020లోనూ రత్నానీ ఓ ఫొటోషూట్‌ని నిర్వహించారు. అప్పట్లో అదీ హాట్‌ టాపిక్‌గా మారింది.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు