Dhanush: ధనుష్‌.. మరో కొత్త కబురు

తమిళ కథా నాయకుడు ధనుష్‌ వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు. ఆయన నటించిన హిందీ చిత్రం ‘అతరంగీ రే’ శుక్రవారమే డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల కాగా.. ‘ది గ్రే మ్యాన్‌’తో పాటు మరో రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. తెలుగులో

Updated : 25 Dec 2021 09:33 IST

మిళ కథా నాయకుడు ధనుష్‌ వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు. ఆయన నటించిన హిందీ చిత్రం ‘అతరంగీ రే’ శుక్రవారమే డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల కాగా.. ‘ది గ్రే మ్యాన్‌’తో పాటు మరో రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. తెలుగులో వెంకీ అట్లూరితో ‘సార్‌’ అనే ద్విభాషా చిత్రం చేయనున్నారు. ఇప్పుడాయన జాబితాలో మరో సినిమా చేరింది. ధనుష్‌.. దర్శకుడు అరుణ్‌ మాథేశ్వరన్‌తో ఓ చిత్రం చేయనున్నట్లు కొన్నాళ్లుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలు వాస్తవమేనని ధనుష్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ‘‘అవును ఊహాగానాలు నిజమే. అరుణ్‌ మతేశ్వరన్‌ దర్శకత్వంలో చేస్తున్నాను. వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని ట్వీట్‌ చేశారు. ‘‘ఈ పెద్ద ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాన’’ంటూ దర్శకుడు అరుణ్‌ ట్విటర్‌ ద్వారా స్పష్టత ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని