Dhanush: ధనుష్‌ కొత్త సినిమా టైటిల్‌ ఇదే..!

కోలీవుడ్‌ స్టార్‌హీరో ధనుష్‌ ప్రాజెక్ట్‌ల విషయంలో స్పీడ్‌ పెంచారు. కేవలం తమిళంలోనే కాకుండా హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌ చిత్రాల్లోనూ ఆయన నటిస్తున్నారు. ఇప్పటికే శేఖర్‌కమ్ములతో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన...

Published : 23 Dec 2021 10:57 IST

హైదరాబాద్‌: కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ ప్రాజెక్ట్‌ల విషయంలో స్పీడ్‌ పెంచారు. కేవలం తమిళంలోనే కాకుండా హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌ చిత్రాల్లోనూ ఆయన నటిస్తున్నారు. ఇప్పటికే శేఖర్‌కమ్ములతో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన ధనుష్‌.. తాజాగా మరో తెలుగు డైరెక్టర్‌తో సరికొత్త చిత్రాన్ని పట్టాలెక్కించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్‌’ చిత్రానికి ఆయన పచ్చజెండా ఊపారు. తమిళం, తెలుగు భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గురువారం ఉదయం ‘సార్‌’ టైటిల్‌ పోస్టర్‌ని చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభం కానుంది.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని