Dhanush: ధనుష్‌ ‘సార్‌’

తమిళ కథానాయకుడు ధనుష్‌, దర్శకుడు వెంకీ అట్లూరి కలయికలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంయుక్తంగా

Updated : 24 Dec 2021 08:53 IST

మిళ కథానాయకుడు ధనుష్‌, దర్శకుడు వెంకీ అట్లూరి కలయికలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్ర తెలుగు వెర్షన్‌కు ‘సార్‌’, తమిళ వెర్షన్‌కు ‘వాతి’ అనే టైటిల్స్‌ ఖరారు చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా టైటిల్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రాన్ని బట్టి సినిమాలో ధనుష్‌ ఓ జూనియర్‌ కాలేజీ లెక్చరర్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. టైటిల్‌ డిజైన్‌లో ఉన్న పెన్ను పాళీని బట్టి.. ఇదొక పీరియాడికల్‌ మూవీ అని అర్థమవుతోంది. అలాగే విద్యావవస్థ చుట్టూ అల్లుకున్న ఉద్వేగభరితమైన ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ధనుష్‌కు జోడీగా సంయుక్తా మేనన్‌ నటించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సాయికుమార్‌, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌, కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: దినేష్‌ కృష్ణన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని