Dharmasthali:‘ధర్మస్థలి’ పోరాటం

ఆకలితో ఉన్న జంతువులకంటే అత్యాశతో ఉన్న మనుషులే ప్రమాదకరం అంటున్నాడు ఓ యువకుడు. అతను ఎవరిపై పోరాటం చేశాడో తెలియాలంటే ‘ధర్మస్థలి’ చూడాల్సిందే. షకలక శంకర్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రమిది. పావని...

Updated : 27 Dec 2021 07:09 IST

ఆకలితో ఉన్న జంతువులకంటే అత్యాశతో ఉన్న మనుషులే ప్రమాదకరం అంటున్నాడు ఓ యువకుడు. అతను ఎవరిపై పోరాటం చేశాడో తెలియాలంటే ‘ధర్మస్థలి’ చూడాల్సిందే. షకలక శంకర్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రమిది. పావని కథానాయిక. రమణ మొగిలి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమ్‌.ఆర్‌.రావు నిర్మాత. జనవరిలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘‘సమాజంలో జరిగే విషం లాంటి ఓ విషయాన్ని స్పృశించే ప్రయత్నమే ఈ చిత్రం. ప్రతీ రోజు మన జీవితాలతో ముడిపడిన ఓ అంశాన్ని కథానాయకుడి పాత్రతో చెప్పిన తీరు ఆలోచింపజేస్తుంది. పక్కా వాణిజ్యాంశాలతో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌కి చక్కటి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయ’’ని తెలిపారు. మణి భట్టాచార్య, సన్నీసింగ్‌, సాయాజీ షిండే, ధన్‌రాజ్‌, భూపాల్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: రాజేంద్ర భరద్వాజ్‌, ఛాయాగ్రహణం: జె.ప్రభాకర్‌రెడ్డి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని