Cinema News: జనవరిలో ‘ధర్మస్థలి’

షకలక శంకర్‌, పావని జంటగా రమణ మోగిలి తెరకెక్కించిన చిత్రం ‘ధర్మస్థలి’. ఎం.ఆర్‌.రావు నిర్మాత. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘శంకర్‌తో ఇలాంటి కథను ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు.

Updated : 19 Dec 2021 06:58 IST

షకలక శంకర్‌, పావని జంటగా రమణ మోగిలి తెరకెక్కించిన చిత్రం ‘ధర్మస్థలి’. ఎం.ఆర్‌.రావు నిర్మాత. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘శంకర్‌తో ఇలాంటి కథను ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. అన్ని రకాల వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. ప్రతిరోజూ మన జీవితాలతో ఆడుకుంటున్న ఓ అంశాన్నే ఈ సినిమా ద్వారా తెలియజేస్తున్నాం. శంకర్‌ మార్క్‌ వినోదం కనిపిస్తుంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామ’’న్నారు. ఈ చిత్రానికి సంగీతం: వినోద్‌ యాజమాన్య, ఛాయాగ్రహణం: జి.ఎల్‌.బాబు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని