
Dhee 13: ‘ఢీ’లో రజనీకాంత్ మేనియా.. డ్యాన్సుతో సినిమా చూపించారు
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్ నటించిన ‘నరసింహ’ చిత్రంలోని పాటలు, సన్నివేశాలతో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించింది ‘ఢీ 13’ కార్యక్రమం. బుధవారం ప్రసారమైన ఈ ఎపిసోడ్ ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. ప్రదీప్ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షోలో కింగ్స్, క్వీన్స్ టీంలు ఉన్న సంగతి తెలిసిందే. క్వీన్స్ బృందంలోని మంజుల రజనీకాంత్‌గా కనిపించి, ప్రతి ఒక్కరినీ ఫిదా చేసింది. ‘నరసింహ’ చిత్రంలో రజనీ ఎంత స్టైలిష్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. అదే తరహాలో దర్శనమిచ్చి, రజనీ హావభావాలకు ఏమాత్రం తగ్గకుండా నటించింది మంజుల. డ్యాన్సు, డైలాగుల్లో రజనీని గుర్తుచేస్తూ మెస్మరైజ్ చేసింది. బుల్లితెరపైకి జూనియర్ రజనీకాంత్ వచ్చారా? అనిపించేలా తన ప్రతిభ చూపింది. మంజులకి పోటీగా నటించి, నర్తించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అటు పాటలు, ఇటు సంభాషణలతో ‘నరసింహ’ సినిమాని చూపించింది ‘మంజుల’ టీం.
రజనీకాంత్.. సుధీర్, రమ్యకృష్ణ.. ప్రియమణి, పూర్ణ
ఇదే ఎపిసోడ్లో ప్రేక్షకులకి వినోదం పంచేందుకు టీం లీడర్లు, న్యాయనిర్ణేతలు కొందరు నటుల్ని ఇమిటేట్ చేశారు. ప్రకాశ్ రాజ్‌గా సుధీర్, రామ్ చరణ్‌గా ఆది కనిపించి నవ్వులు పంచారు. రష్మి, దీపికా పిల్లి, ఆది, సుధీర్ మధ్య సాగిన సంభాషణలు వింటే పొట్ట చెక్కలవ్వాల్సిందే. తర్వాత సుధీర్.. రజనీకాంత్ (నరసింహ)లా మారతాడు. పూర్ణ.. రమ్యకృష్ణలా సుధీర్‌తో కలిసి డ్యాన్సు చేస్తుంది. ప్రియమణి.. రమ్యకృష్ణలా భారీ డైలాగ్ చెప్తుంది. ఇంకెందుకు ఆలస్యం ‘రజనీ’ మేనియాని చూసేయండి...
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.