Published : 19 Nov 2021 22:06 IST

Dhee 13 Promo: హోరాహోరీగా డ్యాన్స్‌ పోరు.. ‘ఢీ’లో మెరిసిన మంచు లక్ష్మి

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రియాలిటీ షో ‘ఢీ’. ప్రస్తుతం ‘కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌’ పేరుతో 13వ సీజన్‌ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. గత సీజన్లలానే ఈ సీజనూ ప్రతిభావంతులైన కంటెస్టెంట్‌లను పరిచయం చేసింది. వారిలో విజేతగా నిలిచేది ఎవరో మరికొన్ని రోజుల్లోనే తెలియనుంది. సెమీ ఫైనల్స్‌-2కి చేరుకున్న ఈ షోకు మంచు లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెతోపాటు యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ (గుంటూరు టాకీస్‌ ఫేం) విచ్చేసి సందడి చేశారు. సిద్ధు, రష్మి, సుధీర్‌తో ఆది చేయించిన స్కిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కంటెస్టెంట్‌లంతా తమ నృత్యంతో కట్టిపడేశారు. ‘మగువా మగువా’ పాట ప్రదర్శన పూర్తయిన తర్వాత కంటెస్టెంట్‌ నైనిక భావోద్వేగానికి గురైంది. రష్మి తనకు స్ఫూర్తి అని తెలిపింది. నైనిక ఎందుకలా ఫీలైంది? మంచు లక్ష్మికి ఎవరి పెర్ఫామెన్స్‌ నచ్చింది? తెలియాలంటే నవంబరు 24న వరకు ఆగాల్సిందే. ప్రస్తుతానికి ప్రోమో చూసి ఆనందించండి..


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని