
Dhee 13 promo: ఇలాంటి గిఫ్ట్ ఎవ్వరూ ఇవ్వలేరు.. ‘ఢీ’లో రోజా సందడి!
ఇంటర్నెట్ డెస్క్: విశేష ప్రేక్షకాదరణతో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రియాలిటీ షోగా పేరొందింది ‘ఢీ’. ‘కింగ్స్ వర్సెస్ క్వీన్స్’ పేరుతో ప్రస్తుతం 13వ సీజన్ ప్రసారమవుతోంది. ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ షో సెమీ ఫైనల్స్‌కి చేరుకుంది. హోరాహోరీగా సాగిన ఈ ఎపిసోడ్‌కి ప్రముఖ నటి రోజా ముఖ్య అతిథిగా విచ్చేసి అలరించారు. కార్యక్రమ న్యాయనిర్ణీతలు పూర్ణ, ప్రియమణి, టీమ్ లీడర్లు రష్మి, దీపికాతో కలిసి డ్యాన్స్ చేశారు. కంటెస్టెంట్ల ప్రతిభను మెచ్చుకున్నారు. రోజా పుట్టినరోజు (నవంబరు 17)ను పుస్కరించుకుని ఓ కంటెస్టెంట్ ఆమె సినిమాల్లోని పాటలకు అభినయించింది. ఈ పెర్ఫామెన్స్ తనని బాగా ఆకట్టుకోవడంతో ‘నా బర్త్‌డేకు మీరు చాలామంచి గిఫ్ట్ ఇచ్చారు. ఇలాంటిది ఎవ్వరూ ఇవ్వలేరు’ అని రోజా ప్రశంసించారు. అనంతరం న్యాయనిర్ణీతలు, టీమ్ లీడర్లు, కంటెస్టెంట్ల సమక్షంలో కేక్‌ని కట్ చేశారు. ఉర్రూతలూగించే కంటెస్టెంట్ల పెర్ఫామెన్స్ చూడాలంటే బుధవారం వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూసి ఆనందించండి...