
Dhee 13 Promo: బొమ్మల్లా సుధీర్.. రష్మీ... అదరగొట్టిన మణికంఠ.. జిత్తు
హైదరాబాద్: ‘కాంచన’లోని ‘నలుపు నేరేడంటి కళ్లల్లోన నువ్వు అందగాడ’ అనే పాటకు గ్రేస్‌ఫుల్‌గా స్టెప్పులేసి గతంలో న్యాయనిర్ణేతల్నే కాకుండా ప్రేక్షకుల్నీ ఫిదా చేశారు మణికంఠ అతని మాస్టర్ జిత్తు. ఆ డ్యాన్స్ వీడియోని ఇప్పటి వరకూ 1.60 కోట్ల మంది వీక్షించారు. కాగా, తాజాగా మణికంఠ మరోసారి తన డ్యాన్స్‌తో ‘ఢీ 13’ స్టేజ్‌పై మెరుపులు మెరిపించాడు. ‘తిరుమల తిరుపతి వేంకటేశా...’ అంటూ తన కొరియోగ్రాఫర్ జిత్తుతో కలిసి డ్యాన్స్ చేసి అదరగొట్టేశాడు. జిత్తు-మణికంఠ చేసిన డ్యాన్స్‌కి ప్రియమణి ఫిదా అయ్యారు. ఈ డ్యాన్స్ సమయంలో వెనుక సుధీర్, రష్మి బొమ్మల్లా కూర్చుని వెరైటీగా కనిపిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో వీడియో తాజాగా బయటకు వచ్చింది.
ప్రియమణి, గణేశ్ మాస్టర్, పూర్ణ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న డ్యాన్స్ షో ‘ఢీ-13’. ‘కింగ్స్ వర్సెస్ క్వీన్స్’ కాన్సెప్ట్‌తో ప్రసారమవుతోన్న ఈ షోకి ప్రదీప్ వ్యాఖ్యాత. కింగ్స్ టీమ్ మెంటర్స్‌గా సుధీర్-ఆది, క్వీన్స్ టీమ్ మెంటర్స్‌గా రష్మి-దీపికా వ్యవహరిస్తున్నారు. వచ్చే బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ఇందులో కింగ్స్ టీమ్స్‌కు చెందిన అబ్బాయిలు తమ డ్యాన్స్‌తో న్యాయనిర్ణేతల్ని ఫిదా చేశారు. మరోవైపు సుధీర్, ఆది, రష్మి కామెడీ పంచులు ఆకట్టుకునేలా ఉన్నాయి. అంతేకాకుండా వచ్చేవారం ఎపిసోడ్‌లో ఓ కొరియోగ్రాఫర్‌కి స్టేజ్‌పై పెళ్లి చేయనున్నారు. ఇంతకీ ఎవరా కొరియోగ్రాఫర్? వాళ్ల ప్రేమకథ ఏమిటి? ఇలా ఎన్నో ఆసక్తికర విశేషాలు చూడాలంటే సెప్టెంబర్ 1న ప్రసారం కానున్న ‘ఢీ-13’ ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Hyderabad News: రోజూ ‘బయోమెట్రిక్’ వేసి వెళ్తే నెలకు రూ. 15 వేలు!
-
Ap-top-news News
Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
-
Ap-top-news News
Andhra News: కలెక్టరమ్మా... కాలువల మధ్య ఇళ్లు కట్టలేమమ్మా!
-
Crime News
Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
-
General News
Heavy Rains: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆత్మహత్యలే
- America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి