
Dhee 13: వాట్ ఏ డ్యాన్స్.. ప్రియమణి, పూర్ణ ఫిదా..!
హైదరాబాద్: ‘ఢీ’ షో వేదికగా ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో ప్రతిసారి డ్యాన్స్ ప్రియుల్ని మెప్పించే జహంగీర్ తాజాగా మరోసారి తన స్టెప్పులతో ఫిదా చేశారు. న్యాయ నిర్ణేతలు, టీమ్ లీడర్ల ప్రశంసలు అందుకున్నారు. ప్రదీప్ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న ‘ఢీ’ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ తాజా ఎపిసోడ్లో కంటిస్టెంట్స్ ప్రతిఒక్కరూ హైఓల్టేజ్ పెర్ఫెమెన్స్లతో మెప్పించారు. కాగా, బుధవారం (ఆగస్టు 4) ప్రసారమైన ఎపిసోడ్లో జహంగీర్.. చిన్నపిల్లాడిలా కాస్ట్యూమ్స్ ధరించి.. స్కూల్లో పిల్లలు చేసే అల్లరిని డ్యాన్స్ రూపంలో సరదాగా చూపించారు. ‘చల్తీకా నామ్ గాడీ హై’ అంటూ ప్రారంభమైన ఈ పెర్ఫామెన్స్‌లో కొరియోగ్రాఫర్ చైతన్య ప్రత్యేకార్షణగా నిలిచాడు. చైతన్య ఎంట్రీతో డ్యాన్స్ మరో లెవల్‌కి వెళ్లిందని ప్రియమణి, పూర్ణ కామెంట్ చేశారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్గా సాగిన జహంగీర్ పెర్ఫామెన్స్‌ని మీరూ చూసేయండి..!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.