
Dhee 13: బుల్లితెరపై సిన్నప్ప డ్యాన్స్ హంగామా!
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ భారతదేశంలో అతిపెద్ద డ్యాన్స్ రియాలిటీ షోగా పేరుగాంచింది ‘ఢీ’. ‘ఈటీవీ’ వేదికగా 13వ సీజన్ ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యహరిస్తోన్న ఈ కార్యక్రమం క్వార్టర్ ఫైనల్స్‌కి చేరుకుంది. పోటాపోటీగా సాగిన ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ‘నారప్ప’ ఫేం రాఖీ, ర్యాప్ సింగర్ రోల్‌రైడా తదితరులు అతిథులుగా విచ్చేసి తమ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఫ్రీడమ్ (ఎవడు) పాటతో రాఖీ, ‘భీమ్లా నాయక్’ పాటతో రోల్‌రైడా ఫిదా చేశారు. ఓ కంటెస్టెంట్ ప్రముఖ నటుడు బాలకృష్ణ గెటప్‌లో దర్శనమిచ్చి అల్లు అర్జున్ పాటకి డ్యాన్స్ చేసి వావ్ అనిపించాడు. సిత్తరాల సిరపడు (అల వైకుంఠపురములో) పాటకి తనదైన శైలిలో స్టెప్పులేసి సందడి చేశాడు. దీంతో షో అంతా ‘జై బాలయ్య’ నినాదంతో దద్దరిల్లింది. ‘క్వీన్స్’ టీమ్ లీడర్లు రష్మి, దీపికా, ‘కింగ్స్’ టీమ్ లీడర్లు ఆది, సుధీర్ ఎప్పటిలానే నవ్వులు పంచారు. పవన్ కల్యాణ్‌ని ఇమిటేట్ చేస్తూ ఓ కంటెస్టెంట్ చేసిన హంగామాతో ప్రోమో ముగిసింది. ఈ వినోదాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించాలంటే అక్టోబరు 27 వరకు వేచి చూడాల్సిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Service charge: సర్వీసు ఛార్జీ వసూలు చేయొద్దు.. హోటల్స్, రెస్టారెంట్లకు కీలక ఆదేశాలు!
-
Sports News
IND vs ENG: లీస్ హాఫ్ సెంచరీ.. వేగంగా పరుగులు చేస్తున్న ఇంగ్లాండ్ ఓపెనర్లు
-
India News
CBSE 10th Result: సీబీఎస్ఈ ‘పది’ ఫలితాలు ఇప్పుడే కాదు..!
-
Crime News
Crime News: ఓఆర్ఆర్పై ప్రమాదం.. ముగ్గురి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
-
General News
Harish Rao: విద్యార్థులకు త్వరలో ఉపకార వేతనాలు.. వెంటనే అందించాలని మంత్రి ఆదేశం
-
India News
Agnipath: నేవీలో అగ్నిపథ్ నియామకాలు.. 10వేల మంది మహిళల దరఖాస్తు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- బిగించారు..ముగిస్తారా..?
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు