Amy Jackson: కాబోయేవాడికి అమీజాక్సన్‌ బ్రేకప్‌ చెప్పేసిందా?

‘ఎవడు’, ‘అభినేత్రి’, ‘రోబో 2.0’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి అమీజాక్సన్‌. ‘2.0’ సినిమా తర్వాత వెండితెరకు దూరంగా ఉన్న ఈ నటి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది...

Updated : 29 Jul 2021 07:17 IST

వైరల్‌గా మారిన కథనాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఎవడు’, ‘అభినేత్రి’, ‘రోబో 2.0’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి అమీజాక్సన్‌. ‘2.0’ సినిమా తర్వాత వెండితెరకు దూరంగా ఉన్న ఈ నటి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అమీజాక్సన్‌ తనకు కాబోయే భర్తకు బ్రేకప్‌ చెప్పేశారని అందరూ చెప్పుకుంటున్నారు. మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ తమ ప్రేమకు స్వస్తి చెప్పుకున్నారని నెట్టింట్లో వరుస కథనాలు దర్శనమిస్తున్నాయి.

వెండితెరపై నటిగా రాణిస్తున్న తరుణంలో జార్జ్‌ పనియోటౌ అనే ప్రముఖ వ్యాపారవేత్తతో అమీజాక్సన్‌కు పరిచయం ఏర్పడింది. అనంతరం తమ స్నేహబంధాన్ని ప్రేమగా మార్చుకున్నారు. కొంతకాలంపాటు సహజీవనంలో ఉన్న ఈ జంటకు ఆండ్రూ అనే బాబు కూడా జన్మించాడు. ఈ క్రమంలోనే అమీ-జార్జ్‌ గతేడాది వివాహం చేసుకుందామని భావించారు. కరోనా కారణంగా వీరి వివాహం వాయిదా పడింది. కాగా, తాజాగా అమీజాక్సన్‌.. జార్జ్‌ పనియోటౌకు సంబంధించిన అన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి తొలగించారు. దీంతో వీరిద్దరూ విడిపోయారంటూ పలు వార్తాకథనాలు బయటకు వచ్చాయి. వ్యక్తిగత విషయాల్లో వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతోనే విడిపోయారంటూ సమాచారం. సదరు వార్తలపై అమీజాక్సన్‌ ఏమాత్రం స్పందించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని