DSJ: ఐదు భాషల్లో.. ‘డిఎస్‌జె’

నట్టి కరుణ ప్రధాన పాత్రలో నట్టికుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘డిఎస్‌జె’ (దెయ్యంతో సహజీవనం). నట్టి క్రాంతి నిర్మాత. సుపర్ణ మలాకర్‌ మరో కథానాయిక. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జనవరి 28న విడుదల

Updated : 07 Dec 2022 22:34 IST

నట్టి కరుణ ప్రధాన పాత్రలో నట్టికుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘డిఎస్‌జె’ (దెయ్యంతో సహజీవనం). నట్టి క్రాంతి నిర్మాత. సుపర్ణ మలాకర్‌ మరో కథానాయిక. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జనవరి 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు నట్టి కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘ఒక యథార్థ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. తనకు జరిగిన అన్యాయానికి ఒక ఆత్మ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనేదాన్ని హారర్‌ నేపథ్యంలో వినూత్నంగా చూపిస్తున్నాం’’ అన్నారు. ‘‘తొలి చిత్రంలోనే విభిన్న కోణాలలో నటించే పాత్ర లభించింది. నటిగా నాకెంతో పేరు తెచ్చే పాత్రవుతుంది. మా నాన్న దర్శకత్వంలో కథానాయికగా పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉంది’’ అంది నాయిక కరుణ. నిర్మాత మాట్లాడుతూ.. ‘‘చిన్న చిత్రాలకు అనుకూలంగా టికెట్‌ ధరలు ఉండేలా నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవిశంకర్‌, ఛాయాగ్రహణం: వెంకట హనుమ నరిశెట్టి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని