Micheal: సందీప్‌కి జోడీగా దివ్యాంశ

సందీప్‌కిషన్‌, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రధారులుగా పాన్‌ ఇండియా స్థాయిలో ‘మైఖేల్‌’ తెరకెక్కుతోంది. రంజిత్‌ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. భరత్‌ చౌదరి, పూస్కూర్‌ రామ్‌మోహన్‌రావు నిర్మాతలు. నారాయణ్‌దాస్‌ కె.నారంగ్‌ సమర్పకులు. ప్రతినాయకుడిగా ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ నటిస్తున్నారు.

Updated : 19 Dec 2021 06:54 IST

సందీప్‌కిషన్‌, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రధారులుగా పాన్‌ ఇండియా స్థాయిలో ‘మైఖేల్‌’ తెరకెక్కుతోంది. రంజిత్‌ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. భరత్‌ చౌదరి, పూస్కూర్‌ రామ్‌మోహన్‌రావు నిర్మాతలు. నారాయణ్‌దాస్‌ కె.నారంగ్‌ సమర్పకులు. ప్రతినాయకుడిగా ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ నటిస్తున్నారు. ఈమధ్యే చిత్రీకరణ మొదలైన ఈ సినిమాలో సందీప్‌కిషన్‌కి జోడీగా దివ్యాంశ కౌశిక్‌ని ఎంపిక చేశారు. ‘మజిలి’తోపాటు పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన కథానాయిక ఈమె. ‘‘యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది.  దర్శకుడు రంజిత్‌ విభిన్నమైన స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. సందీప్‌కిషన్‌ పాత్ర ఎంతో గాఢతతో కూడుకుని ఉంటుంది. ఇందులోని ప్రతీ పాత్రకీ ప్రాధాన్యం ఉంది. తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు నిర్మాతలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని