Cinema News: రాత్రికి రాత్రి మహేశ్‌ హెయిర్‌లా అవ్వాలంటే ఎలా అన్నా?

‘డీజే టిల్లు’ టీజర్‌ విడుదలైంది. సిద్ధు, నేహాశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రమిది.

Published : 05 Sep 2021 23:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘డీజే టిల్లు’. అట్లుంటది మనతోని అనేది ఉపశీర్షిక. నేహాశెట్టి కథానాయిక. విమల్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఓ సెలూన్‌ నేపథ్యంలో సాగే సన్నివేశంతో ప్రారంభమైన ఈ టీజర్‌ ఆద్యంతం అలరిస్తోంది. తన హెయిర్‌ కటింగ్‌ కోసం సిద్ధు ‘ఓం మెన్స్‌ పార్లర్‌’కి వెళ్తాడు. ప్రముఖ నటుడు మహేశ్ బాబు ఫొటో ఆ పార్లర్‌లో ఉంటుంది. దాన్ని చూసిన సిద్ధు.. అందులో మహేశ్ హెయిర్‌ స్టైల్ ఎలా ఉందో అచ్చు అలానే తనకీ కావాలని బార్బర్‌కి చెప్తాడు. ‘రాత్రికి రాత్రి మహేశ్‌ బాబు హెయిర్‌లా అవ్వాలంటే ఎలా అవుతుంది అన్నా?’ అని ఆ బార్బర్‌ ఇచ్చిన సమాధానం నవ్వులు పూయిస్తుంది. సిద్ధు.. డీజే టిల్లు అనే పాత్రలో ట్యాక్సీ డ్రైవర్‌గా కనిపించి, సందడి చేశాడు. డీజే అంటే అమితమైన ఇష్టం ఉన్న వ్యక్తిగా వినోదం పంచాడు. ట్యాక్సీ ఛేజింగ్‌ సన్నివేశాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. నాయిక నేహాశెట్టి నటన మెప్పిస్తోంది. నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. మరి టిల్లుకి డీజే అంటే ఎందుకంత ఇష్టం? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని