RRR Dosti: కీరవాణి ‘దోస్తీ’లో ఎన్ని రకాల ‘దోస్తీ’లు ఉన్నాయో తెలుసా?

నిజ జీవితంలో అంత సులభం కానీ దోస్తీలను వినిపించిన జక్కన్న టీమ్‌

Updated : 01 Aug 2021 20:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అసాధ్యం అనుకున్నదాన్ని చొక్కాకు చెమట చుక్క అంటకుండా చేసేయడం దర్శకుడు రాజమౌళికి అలవాటు. అలా ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమా  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు చిత్రబృందం ‘దోస్తీ’ పేరుతో ప్రత్యేకంగా ఓ పాటను విడుదల చేసింది. ఐదు భాషల్లో విడుదలైన పాట యూట్యూబ్‌లో, సోషల్‌ మీడియాలో దూసుకుపోతోంది. తెలుగు పాటను హేమచంద్ర ఆలపించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. 

సినిమాలో  ఇద్దరు హీరోల స్నేహం గురించి వివరిస్తూనే, పాత్రల నైజం, సినిమా కథాంశం గురించి క్లుప్తంగా వివరించేశారు సిరివెన్నెల.  ఈ క్రమంలో ‘దోస్తీ’ అనే పదం చాలాసార్లు వినిపించింది. ప్రతిసారి ఓ రెండు విరుద్ధ భావాలు/శైలి ఉన్న వాటి మధ్య దోస్తీ గురించి చెప్పారు రచయిత. అసలు ఆ రెండు అంశాల మధ్య దోస్తీ ఎలా కుదురుతుంది అనేది సినిమా చూస్తే తెలుస్తుందేమో. ఈలోగా మొత్తంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దోస్తీ పాటలో  ఎన్ని ‘దోస్తీ’లు ఉన్నాయి. అవేంటో చూసేయండి.

మొత్తంగా ఈ పాటలో ఏడు విభిన్నమైన స్నేహాల గురించి చెప్పారు. ముందుగా చెప్పుకున్నట్లు పై వాటిలో ఏ రెండింటి మధ్య దోస్తీ అంత సులభం కాదు. ఆ మాటకొస్తే అసలు సాధ్యమే కాదు. ఈ లెక్కన సినిమాలో  విరుద్ధ భావాలున్న ఇద్దరు హీరోలు కలసి ఓ అంశం కోసం పోరాడితే ఎలా ఉంటుందో చూపిస్తారేమో. చూద్దాం... ఈ ప్రశ్నకు అక్టోబరు 13న సమాధానం వస్తుందిగా!

మరోసారి పాట చూద్దాం అనుకుంటున్నారా... అయితే ఇక్కడ చూసేయండి!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని