
Venkatesh: ఎన్నో సమస్యలొచ్చాయి.. పోయాయి.. ఇది కూడా అంతే: వెంకటేశ్
హైదరాబాద్: ‘‘ఇంతకు ముందు కూడా ఎన్నో సమస్యలొచ్చాయి, పోయాయి. ఇది కూడా అలాగే పోతుంది’’ అని అంటున్నారు హీరో వెంకటేశ్. ఆయన కథానాయకుడిగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం-2’. 2014లో విడుదలైన ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా సిద్ధమైన విషయం తెలిసిందే. తాజాగా ‘దృశ్యం-2’ టీజర్‌ని శుక్రవారం చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా షేర్ చేసింది. ఇందులో రాంబాబుగా వెంకటేశ్, ఆయన సతీమణిగా మీనాల నటన ఆకట్టుకునేలా ఉంది. ‘‘ఆ చీకటి జ్ఞాపకాల్లోకి మమ్మల్ని మళ్లీ లాగొద్దు’’ అంటూ వెంకీ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. ‘దృశ్యం-2’ ఈ సినిమా ఎప్పుడు, ఎక్కడ రిలీజ్ అవుతుందా? అని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో తాజాగా చిత్రనిర్మాణ సంస్థ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన చేసింది. నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ వేదికగా ‘దృశ్యం-2’ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మలయాళంలో సూపర్‌హిట్ విజయాన్ని అందుకున్న ‘దృశ్యం-2’కి రీమేక్‌గా ఈ సినిమా సిద్ధమైంది. మాతృకను తెరకెక్కించిన జీతూ జోసఫ్ రీమేక్‌నూ రూపొందించారు. నదియా, సంపత్ రాజ్, తనికెళ్ల భరణి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అనూప్ రూబెన్స్ స్వరాలు అందించారు. సురేశ్ ప్రొడెక్షన్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.