
enemy: బరిలో దిగితే శత్రువులే
విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో ఆనంద్ శంకర్ రూపొందించిన చిత్రం ‘ఎనిమి’. మిని స్టూడియోస్ పతాకంపై ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు. మృణాళిని రవి కథానాయిక. మమతా మోహన్ దాస్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. శనివారం ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. వంద సెకన్ల నిడివి ఉన్న ఈ ప్రచార చిత్రంతో.. సినిమాలో యాక్షన్ హంగామా ఏస్థాయిలో ఉండనుందో చూపించారు. ‘‘పోటీ వస్తే మీ ఇద్దరూ శత్రువులే.. మిగతా సమయాల్లో బెస్ట్ ఫ్రెండ్స్’’ అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగ్‌తో చిత్ర కథపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఈ మిత్రులిద్దరూ ఎందుకు శత్రువులుగా మారాల్సి వచ్చింది? ఇద్దరి మధ్య జరిగే పోరులో పై చేయి ఎవరిది? అన్నది తెరపైనే చూడాలి. ఆఖర్లో ‘‘నొప్పిని భరించేవాడే లైఫ్‌లో గెలవగలుగుతాడు’’ అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగ్ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. దీపావళి సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: ఆర్డి.రాజశేఖర్.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.