Varudu Kavalenu: వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు..!

నాగశౌర్య-రీతూవర్మ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వరుడు కావలెను’. లక్ష్మి సౌభాగ్య తెరకెక్కిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందమైన గడసరి అమ్మాయిని...

Published : 02 Oct 2021 11:24 IST

హైదరాబాద్‌: నాగశౌర్య-రీతూవర్మ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వరుడు కావలెను’. లక్ష్మి సౌభాగ్య దర్శకురాలిగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందమైన గడసరి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు.. ఓ అబ్బాయి పడే  కష్టాలను చూపిస్తూ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. యూత్‌ఫుల్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్‌ 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ‘వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు’ అంటూ సాగే పాటను చిత్రబృందం విడుదల చేసింది. గీతామాధురి అండ్‌ కో ఈ పాటను ఎంతో హుషారెత్తించేలా ఆలపించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని