esther anil: ఆమె గౌను బరువు 58కేజీలు..!

ఈ ఫొటోలో కనిపిస్తుంది ఎవరో కాదు నటి ఎస్తర్‌ అనిల్‌. ‘దృశ్యం’ చిత్రంలో కథానాయకుడు వెంకటేశ్‌ చిన్న కూతురిగా కనిపించింది.

Published : 12 Aug 2021 21:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఫొటోలో కనిపిస్తుంది ఎవరో కాదు నటి ఎస్తర్‌ అనిల్‌. ‘దృశ్యం’ చిత్రంలో కథానాయకుడు వెంకటేశ్‌ చిన్న కూతురిగా కనిపించింది. ‘జోహార్‌’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఈమెకి ట్రెండీగా ఉండటం చాలా ఇష్టం. కొత్త కొత్త ఫ్యాషన్‌ పోకడల్ని అనుసరిస్తుంటుంది. ఈ క్రమంలో ఏకంగా 58 కేజీల బరువైన గౌనుని ధరించి నెట్టింట సందడి చేస్తోంది. 58కేజీలా? అని ఆశ్చర్యపోతున్నారు కదూ! ఈ ప్రశ్నే అడుగుతోంది ఎస్తర్‌. ‘మీరు నమ్మగలరా.. 58 కేజీల బరువున్న గౌను ధరించాను. నేనేమో 44 కేజీల బరువు ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ పొడవాటి, మోయలేని గౌనుని రూపొందించేందుకు 30రోజుల సమయం పట్టిందట. దీన్ని తయారుచేసిన వాళ్లకి, ఫొటోషూట్‌ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేసింది.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని