
Jabardasth: ‘జబర్దస్త్’ నటులు.. కన్నీటి వ్యథలు
ఇంటర్నెట్ డెస్క్: ‘బజర్దస్త్’ నటులు సుధీర్, శ్రీను, నరేశ్.. తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకులకు నవ్వాగదు. అంతగా తమని తాము మలుచుకున్నారు. తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే ఇదంతా అంత తేలికగా సాధ్యంకాలేదు. వారు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు.. నీళ్లతోనే కడుపు నింపుకున్నారు. తెర వెనక వీళ్లు పడిన ఆ కష్టాల్ని కార్తీక్, ఇమ్మాన్యుయేల్, నూకరాజు ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ వేదికగా తెరపైకి తీసుకొచ్చారు. ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ 350వ ఎపిసోడ్‌కి చేరుకుంది. సెప్టెంబరు 3న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.
ఓ వైపు ఆనందం, అల్లరి.. మరోవైపు కంటతడి పెట్టించే సన్నివేశాలు ఈ ప్రోమోలో ఉన్నాయి. రాకింగ్ రాకేశ్, రోహిణి భార్యభర్తలుగా నవ్వులు పంచగా.. జగదేక వీరుడు- అతిలోక సుందరిలా రామ్ ప్రసాద్- శ్రీను, అమ్రిష్ పురిలా సుధీర్ దర్శనమిచ్చి ఆకట్టుకున్నారు. బుల్లెట్ భాస్కర్- వర్ష జోడీ సందడి చేసింది. రాము, కుటుంబ సభ్యులు.. హరికృష్ణ, సతీమణి.. హరి, సోదరి.. సాయి, వాళ్ల నాన్న తళుక్కున మెరిశారు. తన తల్లి ఎంతో కష్టపడి తన తండ్రిని బతికించిందని చెప్పి సాయి కన్నీటి పర్యంతమయ్యాడు. ‘బజర్దస్త్ ఆర్టిస్టుల లైఫ్ జర్నీ స్కిట్’ పేరుతో నరేశ్ తాను ఎదుర్కొన్న అవమానాల్ని చూపించాడు. సుధీర్, శ్రీను పడిన కష్టాల్ని కార్తీక్, ఇమ్మాన్యుయేల్ కళ్లకు కట్టినట్టు చూపించారు. హృదయాన్ని బరువెక్కించారు. మరి సుధీర్, శ్రీను ఈ స్కిట్‌పై ఎలా స్పందించారో తెలియాలంటే శుక్రవారం వరకు వేచి చూడాల్సిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.