Extra Jabardasth: కార్పొరేటర్‌గా సుడిగాలి సుధీర్‌.. గెటప్‌ శ్రీనుగా ఫైమా ఇమిటేషన్‌!

‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ ఎపిసోడ్‌. కార్పొరేటర్‌గా అలరించిన సుడిగాలి సుధీర్‌...

Published : 23 Dec 2021 13:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఈటీవీ’ వేదికగా ప్రేక్షకులకు నాన్‌స్టాప్‌ నవ్వులు పంచే కార్యక్రమం ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’. ఎప్పటిలానే ఈవారం గిలిగింతలు పెట్టేందుకు సిద్ధమైంది. తాజా ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో నెట్టింట విడుదలై సందడి చేస్తోంది. సుడిగాలి సుధీర్‌ టీమ్‌ ‘కార్పొరేటర్‌’ స్కిట్‌తో హంగామా చేసింది. భార్య, అత్త మధ్య నలిగే వ్యక్తిగా రాకేశ్‌ నవ్వులు పంచాడు. ఇదే స్కిట్‌లో ‘ఢీ’ ఫేమ్‌ పండు ఎంట్రీ ప్రత్యేకంగా నిలిచింది. విమాన ప్రయాణంలో ఇమ్మాన్యుయేల్‌, బుల్లెట్‌ భాస్కర్‌, ఫైమా, వర్ష చేసిన అల్లరి చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే. ‘లేడీస్‌ స్పెషల్‌ స్కిట్‌’తో రోహిణి, ఫైమా, పవిత్ర నవ్వుల వర్షం కురిపించారు. గెటప్‌ శ్రీనుకి ఎంతో పేరుతీసుకొచ్చిన పాత్రను ఫైమా ఇమిటేట్‌ చేసి ఆకట్టుకుంది.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని