Family Drama Trailer: ‘ఫ్యామిలీ డ్రామా’ ట్రైలర్‌.. సైకో కిల్లర్‌గా సుహాస్‌

తెలుగు ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసేందుకు మరో సినిమా సిద్ధమవుతోంది. అదే సుహాస్‌ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ‘ఫ్యామిలీ డ్రామా’. మెహెర్‌ తేజ్‌ దర్శకుడు. ఇటీవల ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసి, సినిమాపై ఆసక్తిని పెంచిన చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ని విడుదల చేసింది.

Updated : 22 Jul 2021 15:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసేందుకు మరో సినిమా సిద్ధమవుతోంది. అదే సుహాస్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘ఫ్యామిలీ డ్రామా’. మెహెర్‌ తేజ్‌ దర్శకుడు. ఇటీవల ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసి, సినిమాపై ఆసక్తిని పెంచిన చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ విడుదల చేసింది. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆసక్తిగా సాగింది ఈ ట్రైలర్‌. సైకో కిల్లర్‌గా సుహాస్‌ కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. ఆయనలోని విభిన్న కోణాల్ని ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు.

‘ఈత రానివాడు సముద్రాన్ని తిట్టుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుందో.. వినడం రానివాడు సంగీతం గురించి మాట్లాడినా అంతే అసహ్యంగా ఉంటుంది’ అని సుహాస్‌ చెప్పిన డైలాగ్‌ మెప్పిస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే హీరోకి సంగీతం అంటే అభిమానం అనిపిస్తుంది. మరోవైపు సుహాస్‌ హత్యలు చేసే సన్నివేశాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి తండ్రి బూతులు తిడుతున్నాడనే కారణంగా ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఓ అబ్బాయి, తన ఇంట్లో పరిస్థితులు నచ్చక బయటకి వచ్చేసిన ఓ అమ్మాయి.. ఈ ఇద్దరూ ఎలా కలిశారు? వీరికి సుహాస్ ఎలా సాయపడ్డాడు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. మరి సంగీతానికి ప్రాణమిచ్చే హీరో సైకో కిల్లర్‌గా మారి ఇతరుల ప్రాణాల్ని ఎందుకు తీస్తున్నాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మ్యాంగో మాస్‌ మీడియా సమర్పణలో తేజా కాసరపుతో కలిసి మెహెర్‌ తేజ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తేజ కాసరపు, పూజా కిరణ్‌, అనూష నూతుల, శ్రుతి మెహర్‌, సంజయ్‌ రథా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సంగీతం: అజయ్‌, సంజయ్‌, ఛాయాగ్రహణం: వెంకట్‌ ఆర్‌. శాఖమూరి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని